||సుందరకాండ ||

|| ఇదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 5 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచమ స్సర్గః

తతస్స మధ్యంగత మంశుమంతమ్ జ్యోత్స్నావితానం మహదుద్వమంతమ్|
దదర్శ ధీమాన్దివి భానుమంతమ్ గోష్ఠే వృషం మత్తమివ బ్రమంతమ్||1||

స|| తతః సః ధీమాన్ మధ్యం గతం అంశుమంతం ఉద్యమంతం మహత్ జ్యోత్స్నావితానమ్ దివి భానుమంతం గోష్ఠే భ్రమంతం వృషమివ దదర్శ||

ఆప్పుడు ఆ ధీమంతుడు ఆకాశములో మధ్యభాగము చేరి మహత్తరమైన కాంతులను విరజిమ్ముచూ గోశాలలో మదమెక్కిన ఆంబోతులాగా ఉన్న చంద్రుని ని చూశెను.

లోకస్య పాపాని వినాశయంతమ్ మహోదధిం చాపి సమేధయంతమ్|
భూతాని సర్వాణి విరాజయంతమ్ దదర్శ శీతాంశుమథాభియాంతమ్||2||

స|| అథ అభియాన్తం లోకస్య పాపాని వినాశయన్తం మహోదద్ధిం సమేధయంతం చాపి సర్వాణి భూతాని విరాజయన్తం శీతాంశుం దదర్శ||

హనుమంతుడు ముందుకు పోతూ లోకములో పాపాలని నాశనము చేయుటకా , మహా సాగరమును ఉప్పొంచిడానికా అన్నట్లు, సమస్త జీవులను విరాజమానము చేస్తున్నాడా అన్నట్లు కాంతులను విరజిమ్ము చున్న చంద్రుని చూచెను.

యా భాతి లక్ష్మీ ర్భువిమందరస్థా తదా ప్రదోషేశు చ సాగరస్థా|
తథైవ తోయేషు చపుష్కరస్థా రరాజ సా చారునిశాకరస్థా ||3||

స|| భువి యా మందరస్థా లక్ష్మీః భాతి తథా ప్రదోషేషు సాగరస్థా తథా తోయేషు పుష్కరస్థా సా చారునిశాకరస్థా దదర్శ||

భువిలోని మందరపర్వతము మీద ఉన్న లక్ష్మి లాగ, సాగరములో ప్రదోషకాలములో ఉన్న ప్రకాశములాగ, తామరాకుమీద ఉన్న జలములోని ఏట్టి ప్రకాసము ఉందో అట్టి ప్రకాశమే చంద్రుని లో మ్హోజ్జ్వలముగా కనపడుతున్నది.

హంసోయథా రాజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః|
వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోsపి బభ్రాజ తథాంబరస్థః||4||

స||యథా రాజతపంజరస్థాః హంసః యథా మందరకన్దరస్థః సింహః యథా గర్విత కుంజరస్థః వీరః తథా అంబరస్థః చంద్రః అపి భభ్రాజ ||

రజత పంజరములో నున్న హంస లాగ, మందర పర్వతములోని గుహలలో వున్న సింహము లాగ , గర్వముతో ఏనుగపై నున్న వీరుడు లాగ ఆకాశములో నున్న చంద్రుడు కూడా విరాజిల్లెను.

స్థితః కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచలశ్వేత ఇవోచ్ఛశృంగః|
హస్తీవ జాంబూనద బద్ధశృంగో రరాజ చంద్రః పరిపూర్ణశృంగః||5||

స|| పరిపూర్ణ శృంగః చంద్రః తీక్ష్ణశృంగః స్థితః కకుద్మానివ, శ్వేతః ఉచ్చశృంగః మహాచలః (ఇవ) జామ్బూనద బద్ధశృంగః హస్తి ఇవ రరాజ||

వాడికొమ్ములున్నవృషభము లాగా, మహోన్నత శిఖరాలున్న తెల్లని మహా పర్వతములాగా బంగారపు పూతగల్గిన తొడుగులు కల దంతాలు ఏనుగు లాగా పరిపూర్ణకళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.

వినష్ట శీతాంబుతుషారపంకో మహాగ్రహగ్రాహ వినష్ఠ పంకః|
ప్రకాశ లక్ష్మ్యా శ్రయనిర్మలాంకో రరాజ చంద్రో భగవాన్ శశాంకః ||6||

స||వినష్ట శీతాంబు తుషారపంకః మహాగ్రహాగ్రాహ వినష్ట పంకః ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకః శశాంకః భగవాన్ చంద్రః రరాజ||

మంచు తుంపరలమాలిన్యము తొలగి పోయిమెరుస్తున్న తుషారబిందువులాగ, మహాగ్రహముల వలనకలిగిన మాలిన్యముతొలగి ప్రకాశించువారిలాగ, గొప్పకాంతితో స్పష్టముగానున్న మచ్చ కల చంద్రుడు ప్రకాశిశ్తున్నాడు.

శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రోమహారణం ప్రాప్య యథా గజేంద్రః|
రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథాప్రకాశో విరరాజ చంద్రః||7||

స|| శిలాతలం ప్రాప్య యథా మృగేన్ద్రః మహారణం ప్రాప్య యథా గజేన్ద్రః రాజ్యం సమాసాద్య యథా నరేణ్ద్రః తథా ప్రకాశః చంద్రః రరాజ||

శిలాతలము పైకెక్కిన మృగరాజము లాగ, మహారణము లో ప్రవేశించిన పొందిన గజరాజు లాగా, రాజ్యాన్ని తిరిగి సంపాదించిన రాజు లాగా చంద్రుడు ప్రకాశించుచున్నాడు.
.
ప్రకాశ చంద్రోదయ నష్ఠదోషః ప్రవృత్తరక్షః పిసితాశదోషః|
రామాభిరామేరితిచిత్తదోషః స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోషః||8||

స|| యదా భగవాన్ ప్రదోషః స్వర్గప్రకాశః తదా చంద్రోదయ ప్రకాశాత్ (తిమిర) దోషః నష్టః ప్రవృత్త రక్షః పిశితాశదోషః రామాభిరామేరితి చిత్త దోషః (భవతి)||

ప్రదోషకాలములో స్వర్గ ములను ప్రకాశింపచేసిన చంద్రుడి కాంతితో చంద్రోదయముతో చీకటి నశించిపోయెను, మాంసభక్షకుల కౄరకర్మలు ఆగిపోయెను, ప్రియురాళ్ళు తమతమకోపాలని వదిలేసి ప్రియులతో కలిపోయిరి.

తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తా|
నక్తాంచరా శ్చాపి తథా ప్రవృత్తా నిహర్తు మత్యద్భుతరౌద్రవృత్తాః||9||

స|| తంత్రీ స్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః | సువృతాః నార్యః పతిభిః స్వపన్తి| నక్తం చరాః అత్యత్భుత రౌద్రవృత్తాః అపి విహర్తుం ప్రవృత్తాః||

తంత్రీవాద్యములు చెవులకు సుఖమునిస్తున్నాయి. పవిత్రులగు సతీమణులు భర్తతో శయినిస్తున్నారు, చీకట్లలో తిరిగే రాక్షసులు విర్రవీగుతో తిరుగుచున్నారు.

మత్తప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని|
వీరశ్రియాచాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కపిః కులాని||10||

స|| ధీమాన్ వీరః హనుమాన్ సః శ్రియా సమాకులాని కులాని మత్తప్రమత్తాని చ రథాశ్వభద్రాసన సంకులాని అపి దదర్శ||

ధీమంతుడు వీరుడు అయిన హనుమంతుడు శ్రియముతో కూడిన వారి ఇళ్ళలో మత్తమెక్కిన వారిని, రథములు అశ్వములు ఏనుగులు మంచి ఆసనములు గలవారిని చూచెను.

పరస్పరం చాధిక మక్షిపంతి భుజాంశ్చ పీనా నధిక్షిపంతి|
మత్త ప్రలాపా నధి విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపన్తి ||11||

స|| (తే) పరస్పరం అధికం అక్షిపన్తి | పీనాన్ భుజాన్ చ అధికం క్షిపన్తి | మత్తప్రలాపాన్ అధి విక్షిపన్తి | మత్తాని అన్యోన్యం అధిక్షిపన్తి చ||

వాళ్ళూ పరస్పరము అధిక్షేపించుకుంటూ, భుజములు ఎగరవేసుకుంటూ , మత్తించిన ప్రేలాపములలో నున్న వారినీ, మత్తముతో పరస్పరము ఆక్షేపించుకొనుచున్నవారినీ చూచెను.

రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణీ కాంతాసు చ విక్షిపంతి |
రూపాణి చిత్రాణి చ విక్షిపంతి ధృఢాని చాపాని చ విక్షిపంతి||12||

స|| (తే) వక్షాంసి విక్షిపన్తి కాన్తాసు గాత్రాణి విక్షిపన్తి చ | రక్షాంసి దృఢాని చాపాని విక్షిపన్తి | చిత్రాణి రూపాణి విక్షిపన్తి చ||

హనుమంతుడు రాక్షసులలో తమ వక్షములు పెద్దగాచేసుకుంటూ కాంతల మీద పడుచున్నవారిని, ధృడమైన ధనస్సుని పటుకొనొవున్నవారిని, చిత్రమైన రూపాలని ప్రదర్శిస్తున్నవారిని చూచెను

దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః తథాపరాః తత్ర పునః స్వపన్త్యః|
సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః క్రుద్ధాః పరాశ్చాపి వినిః శ్వసంత్యః||13||

స|| సమాలభంత్యః కాన్తాః చ తత్ర అపరాః పునః స్వపన్త్యః| తే సురూప వక్త్రాః చ| తథా హసంత్యః క్రుద్ధాః చ|| అపరాః వినిః శ్వసంత్యః||

కాంతలు కొందరు చందనానులేపనము చేసినవారు, కొందరు నిద్రించుచున్నవారు మంచి రూపము ముఖము కలవారు నవ్వుతూ ఉన్నవారు, కోపముతో ఉన్నవారు, కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నవారు వున్నారు

మహాగజైశ్చాపి తథా నదద్భిః సుపూజితైశ్చాపి తథా సుసద్భిః|
రరాజ వీరైశ్చ వినిఃశ్ర్వసద్భిః హ్రదోభుజంగైరివ నిఃశ్ర్వసద్భిః||14||

స|| తథా నదద్భిః సుపూజితైః మహగజైః చ , హ్రదో నిఃశ్వ్రసద్భిః భుజంగైరివ వినిఃశ్ర్వసద్భిః వీరైః చ రరాజ||

ఆ నగరము మహాగజములతోనూ మహాపురుషులతోనూ ప్రకాశించుచున్నది. దీర్ఘనిశ్వాసములు విడుస్తున్న వీరులతో బుసలు కొట్టుచున్న సర్పములుకల నగరము లాగా వెలుగుచున్నది.

బుద్ధి ప్రధానాన్ రుచిరాభిదానాన్ సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్|
నానావిధాన్ రుచిరాభిదానాన్ దదర్శ తస్యాం పురియాతుధానాన్||15||

స|| తస్యామ్ పురీమ్ జగతః ప్రధానాన్ బుద్ధిప్రధానాన్ రుచిరాభిదానాన్ సంశ్రద్ధధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ యాతుధానాన్ దదర్శ||

ఆ నగరములో జగత్తులో ప్రధానులై, బుద్ధిజీవులైనవారిని మనోహరమైన వాక్కుకలవారిని, శ్రద్ధకలవారిని అనేకవిధములైన వారిని చూచెను.

ననంద దృష్ట్వా స చ తాన్ సురూపాన్ నానాగుణానాత్మగుణానురూపాన్ |
విద్యోతమానాన్ స తదానురూపాన్ దదర్శ కాంశ్చిచ్చపునర్విరూపాన్||16||

స|| సః సురూపాన్ నానాగుణాన్ ఆత్మగుణానురూపాం విద్యోతమానాన్ తాన్ దృష్ట్వా సః ననంద | తదా కశ్చిత్ విరూపాన్ అనురూపాన్ చ దదర్శ ||

హనుమంతుడు మంచిరూపము గుణములతో తమగుణములకు అనుగణముగా ప్రవర్తిస్తున్నవారిని చూచి ఆనందపడెను. అలాగే కొంతమంది వికృతరూపముగల అరిరూపానుసారము ప్రవృత్తులుకల వారిని చూచెను.

తతో వరార్హాః సువిశుద్ధభావాః తేషాం ప్రియః తత్ర మహానుభావాః|
ప్రియేషు పానేషు చ సక్తభావా దదర్శ తారా ఇవ సుప్రభావాః||17||

స|| తతః తత్ర వరార్హాః విశుద్ధభావాః మహానుభావాః ప్రియేషు పానేషు సక్తభావాః సుప్రభావాః చ దదర్శ| తేషాం తారా ఇవ స్త్రియః దదర్శ||

అప్పుడు అక్కడ శ్రేష్టమైన ఆభరణములతో ఉత్తమోత్తమ్రూపము గలవారిని, శుద్ధమైన అంతఃకరణము కలవారిని, గొప్పప్రభావము కలవారిని, ప్రియులయందు పానమునందు ఆసక్తి కలవారిని చూచెను. వారిలో తారలవలె ప్రకాశిస్తున్నవారిని కూడా చూచెను.

శ్రియాజ్వలంతీ స్త్రపయోప గుఢా నిశీథకాలే రమణోపగూఢాః |
దదర్శ కాశ్చిత్ప్రమదోపగూఢాః యథా విహంగాః కుసుమోపగూఢాః ||18||

స||ఉపగూఢాః శ్రియా జ్వలంతీః త్రపయా , తథైవ నిశీథకాలే రమణోపగూఢాః కాశ్చిత్ కుసుమోపగూఢాః ప్రమదోపగూఢః విహంగాః యథా (స్త్రియః) దదర్శ||

రాత్రిసమయములో ప్రియులకౌగిళ్ళలో కాంతితో ప్రకాశిస్తూ , కొందరు పుష్పములతో అలంకరింపబడి ప్రియులకౌగిలింతలలో సమ్తోషముతో పక్షులవలె నున్న వారిని చూచెను.

అన్యాః పునర్హర్మ్యతలోపవిష్టాస్తత్ర ప్రియాంగేషు సుఖోపవిష్టాః |
భర్తుః ప్రియా ధర్మ పరా నివిష్టా దదర్శ ధీమాన్మదనాభి విష్టాః||19||

స|| ధీమాన్ ( హనుమాన్) హర్మ్యతలోపవిష్టాః ప్రియాంగేషు సుఖోపవిష్టాః ప్రియాః మదనాభివిష్టాః అన్యాః భర్తుః ధర్మపరాH నివిష్టాః దదర్శ||

అపావృతాః కాంచనరాజివర్ణాః కాశ్చిత్పరార్థ్యాః తపనీయవర్ణాః|
పునశ్చ కాశ్చిచ్చశలక్ష్మవర్ణాః కాంత ప్రహీణా రుచిరాంగవర్ణాః||20||

స|| అపావృతాః కాంచనరాజివర్ణాః పరార్థ్యాః తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ కాన్తప్రహీణాః శశలక్ష్మవర్ణాః కాశ్చిత్ రుచిరాంగ వర్ణాః (దదర్శ)||

తతః ప్రియాన్ప్రాప్య మనోభిరామాః సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః|
గృహేషు హృష్టాః పరమాభిరామాః హరిప్రవీరః స దదర్శ రామాః||21||

స|| హరిప్రవీరః తతః గృహేషు ప్రియాన్ ప్రాప్య మనోభిరామాః సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్యరామాః పరమాభిరామాః హృష్టాః సః దదర్శ ||

చంద్రప్రకాశశ్చ హి వక్త్రమాలాః వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః|
విభూషణానాంచ దదర్శ మాలాః శతహ్రదానామివ చారుమాలాః||22||

స|| చంద్రప్రకాశాః వక్త్రమాలాశ్ఛ వక్రాక్షిపక్ష్మాశ్చసునేత్రమాలాః శతహ్రదానామ్ చారుమాలాః విభూషణానామ్ మాలాః చ ||

నత్వేవ సీతాం పరమాభిజాతామ్ పథిస్థితే రాజకులే ప్రజాతామ్|
లతాం ప్రపుల్లామివ సాధుజాతామ్ దదర్శ తన్వీం మనసాభిజాతామ్||23||

స|| (పరంతు) రాజకులే ప్రజాతామ్ పరమాభిజాతామ్ సాధు జాతాం ప్రఫుల్లాం లతాం ఇవ తన్వీం పథి స్థితే సీతాం న దదర్శ||

సనాతనే వర్త్మని సన్నివిష్టామ్ రామేక్షణాం తాం మదనాభివిష్టామ్|
భర్తుర్మనః శ్రీమదనుప్రవిష్టామ్ స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టామ్||24||

స|| సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం శ్రీమత్ భర్తుః మనః మదనాభివిష్టాం వరాభ్యః స్త్రీభ్యశ్చ అనుప్రవిష్టాం విశిష్టాం తాం న దదర్శ||

ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురా వరార్హోత్తమ నిష్కకంఠీమ్|
సుజాతపక్ష్మామభిరక్తకంఠీమ్ వనే ప్రవృత్తామివ నీలకంఠీమ్||25||

స|| ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురా వరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం వనే అప్రవృత్తాం నీలకంఠీం ఇవ తన్వీం (తాం న దదర్శ)

అవ్యక్త రేఖామివ చంద్ర రేఖామ్ పాంసుప్రదిగ్ధా మివ హేమరేఖామ్|
క్షతప్రరూఢా మివ బాణరేఖామ్ వాయుప్రభిన్నామివ మేఘ రేఖామ్||26||

స|| అవ్యక్త రేఖాం చంద్రరేఖామివ పాంసుప్రదిగ్ధాం హేమ రేఖాం ఇవ క్షతప్రరూఢాం బాణరేఖామివ వాయుప్రభిన్నాం మేఘరేఖామివ (స రామ పత్నీం న దదర్శ)

సీతామపస్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య|
బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవా చిరస్య ||27||

స|| వదతాం వరస్య మనుజేశ్వరస్య రామస్య పత్నీం అచిరస్య అపశ్యన్ ప్లవంగమః దుఃఖాభిహితః చిరస్య మంద ఇవ బభూవ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రామాయనములో సుందరకాండ లో ఇదవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||